NAVAGRAHA GAYATRI MANTRA IN TELUGU

నవగ్రహ గాయత్రి తాత్పర్య సహితము.


నవగ్రహ గాయత్రి



ఓం విశ్వమండలాయ విద్మహే
నవస్థానాయ ధీమహీ
తన్నో గ్రహః ప్రచోదయాత్ ll
తాత్పర్యము : గ్రహం  అనగా  గృహ్ణాతి అధ్రుష్టమితి గ్రహః  ప్రాణులను యద్రుష్టముల గైకొని  నడుపునదని వ్యుత్పత్తి, సకల మండలాలను వ్యాపించి నవ స్థానాలకు విభుడై యుండి  ఆ గ్రహము మనకు మంచిని మించునట్లు ప్రోత్సహించును. 

భాస్కరః
ఓం భాస్కరాయ విద్మహే
మహాద్యుతికరాయ ధీమహీ
తన్నో ఆదిత్యః  ప్రచోదయాత్ ll 

తాత్పర్యము : భాసః కరోతి ఇతి భాస్కరః = కాంతులను జేయువాడు.  పగలు తన కిరణములను  వ్యాపింప జేయువాడు.మహాత్ ధ్యుతికరాయ = మిక్కిలి కాంతులను జేయువాడు, చేయునట్టి కిరణములు గలవాడు. అధితేహి అపత్యం పుమాన్ = అదితి యొక్క కొడుకు అతడు మనకు మంచి దారిలోనికి నడిపించును.


జ్యోతి 
ఓం భాస్కరాయ విద్మహే 
జ్యోతిశ్కరాయ  ధీమహి 
తన్నో ఆదిత్యః  ప్రచోదయాత్ ll 


ద్యుతికరః 
ఓం దివాకరాయ విద్మహే
మహాద్యుతికరాయ ధీమహీ 
తన్నో ఆదిత్యః  ప్రచోదయాత్ ll 

ఆదిత్యః 
ఆదిత్యాయ విద్మహే
సహస్ర కిరణాయ ధీమహీ 
తన్నో భాను:  ప్రచోదయాత్ ll